సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట.. రూ.15 లక్షల బీమా ప్రీమియం చెల్లింపు
**సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట.. రూ.15 లక్షల బీమా ప్రీమియం చెల్లింపు* నవంబర్ 2: హనుమకొండ జిల్లా వేలేరు మేజర్ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమానికి సర్పంచ్ బిల్లా యాదగిరి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న 18 మంది సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తూ, తపాలా శాఖ (పోస్ట్ ఆఫీస్) ద్వారా వార్షిక బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో ప్రజలకు వివిధ...