సాఫ్ట్వేర్, డ్రోన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ
*సాఫ్ట్వేర్, డ్రోన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ* గిరిజన యువతీ యువకులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో అవకాశం. ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 2 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు ఐటీడీఏ పీవో బి. రాహుల్ తెలిపారు.టైలరింగ్, సాఫ్ట్వేర్, డ్రోన్ టెక్నీషియన్ తదితర కోర్సుల్లో 3 నుంచి 4 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు....