prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 8:08 am Digital Edition : PRAJA VANI

సాఫ్ట్‌వేర్, డ్రోన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

*సాఫ్ట్‌వేర్, డ్రోన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ*

గిరిజన యువతీ యువకులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో అవకాశం.

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 2

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు ఐటీడీఏ పీవో బి. రాహుల్ తెలిపారు.టైలరింగ్, సాఫ్ట్‌వేర్, డ్రోన్ టెక్నీషియన్ తదితర కోర్సుల్లో 3 నుంచి 4 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
18 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన గిరిజన యువతీ యువకులు అవసరమైన ధ్రువపత్రాలతో నవంబర్ 4వ తేదీలోగా స్థానిక వైటీసీలో దరఖాస్తు చేసుకోవాలని పీవో సూచించారు.