*సన్ షైన్ పాఠశాలలో ఘనంగా దీపావళి పండుగ*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని సన్ షైన్ పాఠశాలలో దీపావళి పండుగను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు దీపావళి పండుగ ప్రాముఖ్యతను, విశిష్టతను పండగ జరుపుకునే కారణాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న మాట్లాడుతూ దీపావళి పండుగ అనేది చెడుపై మంచి సాధించిన విజయం అని చీకటి నుండి వెలుతురులోకి రావడం అని, కావున మనం కూడా కింది స్థాయి నుండి పై స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మా, ప్రిన్సిపాల్ రవికాంత్, వైస్ ప్రిన్సిపాల్ వినయ్, తెలుగు ఉపాధ్యాయుడు రమేష్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.