prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 12:01 pm Digital Edition : RAJASHEKARREDDY

వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన కానిస్టేబుల్ చిరంజీవి

పోలీస్ విధులతో పాటు సాహిత్య రంగంలోనూ ప్రతిభ చాటిన గుగ్గిళ్ల వాసి

బెజ్జంకి, నవంబర్ 7 (ప్రజావాణి)

 

పోలీస్ సంక్షేమ దినోత్సవం–2026 సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన కానిస్టేబుల్ చిరంజీవి ప్రథమ బహుమతి సాధించారు. ప్రస్తుతం అక్కన్నపేట మండలంలో విధులు నిర్వహిస్తున్న ఆయన, పోలీస్ శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే సాహిత్య రంగంలో తన ప్రతిభను చాటుకున్నారు.జిల్లా పోలీసులతో పాటు విద్యార్థులకు నిర్వహించిన ఈ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, అదనపు డీసీపీలు చిరంజీవికి ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు.పోలీస్ విధులతో పాటు సాహిత్య రంగంలోనూ రాణిస్తూ ప్రథమ బహుమతి సాధించడం పట్ల గుగ్గిళ్ల గ్రామస్థులు, పోలీస్ అధికారులు, తోటి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.పలువురు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.