వేదాంతపురంలో మూతపడిన పల్లె దవాఖాన.. వైద్యం కోసం ప్రజలు అవస్థలు
*వేదాంతపురంలో మూతపడిన పల్లె దవాఖాన.. వైద్యం కోసం ప్రజలు అవస్థలు** ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 2 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె దవాఖాన (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) నిర్వాహకుల నిర్లక్ష్యంతో మూతపడుతోందనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉచిత వైద్యం అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి ఇక్కడి సిబ్బంది తీరు తూట్లు పొడుస్తోంది. ఎప్పుడు వచ్చి చూసినా ఈ ఆసుపత్రికి తాళం వేసి ఉండటంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం...