వృద్ధుడికి అండగా నిలిచిన ఘట్‌కేసర్ పోలీసులు.. ఆశ్రమానికి తరలింపు

ఘట్‌కేసర్, నవంబర్ 5: ఎదులాబాద్ గ్రామంలో దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న గుర్తుతెలియని వృద్ధుడిని మహిళా పోలీస్ కానిస్టేబుల్ మానస గుర్తించి రక్షించారు. విచారించగా తన పేరు చుంచు రాములు, తండ్రి పేరు ఎల్లయ్య అని మాత్రమే చెప్పగలిగారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు, స్వగ్రామం వివరాలు వెల్లడించలేకపోయారు. దీంతో ఘట్‌కేసర్ పోలీసులు మానవీయంగా స్పందించి, వృద్ధుడిని కొండాపూర్‌లోని అమ్మ నాన్న ఆశ్రమానికి సురక్షితంగా తరలించి ఆశ్రయం కల్పించారు. వృద్ధుడి కుటుంబ సభ్యులు, బంధువులు లేదా ఆచూకీ తెలిసిన వారు ఘట్‌కేసర్ పోలీస్...