prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 5:35 pm Digital Edition : PRAJA VANI

వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం.. వృద్ధులకు అన్నదానం, పాలు, పండ్ల పంపిణీ

వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం.. వృద్ధులకు అన్నదానం, పాలు, పండ్ల పంపిణీ!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం, దీపావళి సందర్భంగా రాజేశ్వరి వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం

కూకట్‌పల్లి: నవంబర్ 8 ( ప్రజావాణి )

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదినం, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ సాయినగర్‌లోని రాజేశ్వరి వృద్ధాశ్రమంలో ఘనంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. వ్యాపారవేత్త సాయి సుభాన్ బంధుమిత్రుల ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం చేయడంతో పాటు పాలు, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కూకట్‌పల్లి ప్రెస్ క్లబ్ (టిడబ్ల్యూజేఎఫ్) అధ్యక్షుడు ఎర్ర యాకన్న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా తెలుగు ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

పండుగలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, సమాజంలోని నిరుపేదలు, వృద్ధుల జీవితాల్లో ఆనందాన్ని నింపే సేవా కార్యక్రమాలకు వేదిక కావాలని నిర్వాహకులు పేర్కొన్నారు. వృద్ధాశ్రమంలోని పెద్దలతో ఆత్మీయంగా గడుపుతూ అన్నదానం, పాలు, పండ్లు పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆకాంక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు చిట్టినీడి వెంకట రామారావు, నరసింహ, వెంకట్, కృష్ణ, అమ్ములు, శ్యాం, రాజు తదితరులు పాల్గొన్నారు.