విశ్వశాంతి పాఠశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
*విశ్వశాంతి పాఠశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం* రాయికల్, నవంబర్ 11(ప్రజావాణి) రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీన భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు.ఆయన విద్యను ప్రతి ఒక్కరి హక్కుగా భావించారని, దేశ అభివృద్ధికి విద్య ఎంతో అవసరమని బలంగా విశ్వసించారని అన్నారు.విద్య...