విశ్వశాంతిలో ముందస్తుగా దీపావళి పండుగ వేడుకలు
*విశ్వశాంతిలో ముందస్తుగా దీపావళి పండుగ వేడుకలు* *రాయికల్; నవంబర్ 07 (ప్రజావాణి):* రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు అందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి, ఎంతో ఆనందోత్సాహాలతో బాణసంచా పేల్చి కేరింతలు కొట్టారు. పాఠశాల ప్రాంగణం మొత్తం దీపకాంతులతో, పిల్లల నవ్వులతో కళకళలాడింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ మన దేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే వెలుగుల పండుగ ‘దీపావళి’ అని అన్నారు. ‘దీపావళి’ అంటే ‘దీపాల వరుస’ అని...