కోసిగిలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

కోసిగిలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలుకర్నూలు, నవంబర్ 12 (ప్రజావాణి):కోసిగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, దేశానికి మరియు విద్యారంగానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.1888 నవంబర్ 11న సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో జన్మించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిన్ననాటి నుంచే...