విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి. -చెకుముకి సైన్స్ సంబరాల గోడపత్రిక ఆవిష్కరణ రాయపోల్. నవంబర్ 3 (ప్రజావాణి) విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించి, సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు శాస్త్రీయ ఆలోచనా విధానం, పరిశీలన శక్తిని పెంపొందించేందుకు చెకుముకి సైన్స్ సంబరాలు దోహదపడతాయని రాయపోల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో చెకుముకి సైన్స్ సంబరాలు–2026 గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాల,మండల స్థాయి సైన్స్ సంబరాలను విజయవంతం చేసేందుకు అన్ని...