prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 7:17 pm Digital Edition : PRAJA VANI

వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ లో అందెశ్రీ వర్ధంతి

వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ లో అందెశ్రీ వర్ధంతి
ప్రజావాణి,ఇనుగుర్తి: జయ జయహే తెలంగాణ గీత రచయిత,ప్రజా కవి అందెశ్రీ ప్రథమ వర్ధంతిని మండల కేంద్రం ఇనుగుర్తి లోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ లో కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అందెశ్రీ చిత్రపటానికి కట్టయ్య యాదవ్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ కట్టయ్య మాట్లాడుతూ తెలంగాణ తల్లి వైభవాన్ని గీతమై ప్రపంచానికి చాటిన కలం వీరుడు అందెశ్రీ అన్నారు. ఆయన కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం సామాజిక సందేశమని తెలిపారు. అందెశ్రీ రాసిన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనే పాట కలిగించిన స్ఫూర్తి చైతన్యం అంతా ఇంత కాదని సమాజంలో నశిస్తున్న మానవత్వాన్ని ప్రతిబింబించే విధంగా సాగిందన్నారు.తెలంగాణ ఉద్యమంలో తన పాటతో ఉద్యమానికి జీవం పోసి సాహిత్య లోకాన్నే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలందరినీ ఉద్యమం వైపు నడిపించిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.