prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 1:35 pm Digital Edition : PRAJA VANI

వరికోల్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రచారం

వరికోల్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రచారం

రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి

వరికోల్, నవంబర్ 1 (ప్రజావాణి):

టీపీసీసీ, డీసీసీ మరియు పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నడికూడ మండలం వరికోల్ గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై ఆదివారం ప్రచారం నిర్వహించారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఊర రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో 05, 06 బూత్‌ల పరిధిలోని పట్టభద్రులను కలిసి ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయనను గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నడికూడ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దొగ్గేల వినయ్, మండల ప్రధాన కార్యదర్శి చింతల రజినీకాంత్, బూత్ ఇన్‌చార్జులు జవాజీ కుమారస్వామి, బొల్లా ఓదెలు, యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బాలుగు కిరణ్, బీసీ సెల్ గ్రామ అధ్యక్షుడు రమేష్, గుడి డైరెక్టర్లు ఐలయ్య, స్వామి, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీను, ఉపాధ్యక్షుడు కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ గ్రామ కార్యదర్శి దొగ్గేల రాజు తదితరులు పాల్గొన్నారు.