prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 6:30 pm Digital Edition : PRAJA VANI

లడక్ బజార్‌లో ప్రత్యేక వైద్య శిబిరం

*లడక్ బజార్‌లో ప్రత్యేక వైద్య శిబిరం*

మధిర : మన ప్రజావాణి నవంబర్ 5

*వర్షాకాల వ్యాధులపై ప్రజలకు అవగాహన*

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మధిర పట్టణంలోని లడక్ బజార్‌లో గురువారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పృథ్వీరాజ్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పల్లె దవాఖాన వైద్యురాలు వి. హేమలత ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాల కారణంగా దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వివరించారు. అదేవిధంగా పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ వైద్య శిబిరంలో ఏఎన్‌ఎం లు వై. లక్ష్మి,
జి. సావిత్రి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.