లక్ష్మణ్ బాబును పరామర్శించిన వెంకటాపురం బీఆర్‌ఎస్ నాయకులు
ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మండల నాయకులు
త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
వెంకటాపురం (నూగురు), నవంబర్ 4 (ప్రజావాణి): ఇటీవల ప్రమాదంలో కాలుకు గాయమై నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ములుగు జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు లక్ష్మణ్ బాబును వెంకటాపురం బీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు. వెంకటాపురం సీనియర్ నాయకులు గోడవర్తి నర్సింహమూర్తి, ముడుంబ శ్రీనివాస్, గంప రాంబాబు మండలం అధ్యక్షులు, ఆధ్వర్యంలో ఆయన నివాసానికి వెళ్లిన నాయకులు, లక్ష్మణ్ బాబును పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యాంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వెంకటాపురం (నూగురు) బీఆర్‌ఎస్ అధ్యక్షుడు గంప రాంబాబు మాట్లాడుతూ.. లక్ష్మణ్ బాబు త్వరగా కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో నాయకులు మంచర్ల నాగేశ్వరరావు, బట్ట నాగేందర్, కుసం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.