రైతు భరోసా పేరుతో వస్తున్న నకిలీ సందేశాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి..
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 04 (ప్రజావాణి): రాష్ట్ర స్థాయిలో ఏపీసీ, వ్యవసాయ శాఖ డైరెక్టర్ సూచనల మేరకు, రైతు భరోసా పథకం పేరుతో రైతులకు వస్తున్న సందేశాలు నకిలీవని, వాటిని నమ్మవద్దని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,70,000 మంది రైతులకు ఈ నకిలీ సందేశాలు వచ్చినట్లు వారు గుర్తించారని, ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ విభాగం దృష్టికి తీసుకెళ్లారని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో రైతు భరోసా పేరుతో వచ్చే అనుమానాస్పద సందేశాలను రైతులు నమ్మవద్దని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.