prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 7:58 pm Digital Edition : PRAJA VANI

రైతు భరోసా జమ మెసేజ్ లపై రైతుల అయోమయం ప్రభుత్వం వెంటనే స్పందించాలి

రైతు భరోసా జమ మెసేజ్ లపై రైతుల అయోమయం ప్రభుత్వం వెంటనే స్పందించాలి.

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

రైతు భరోసా పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసినట్లు ముఖ్యమంత్రి పేరుతో సందేశాలు పంపుతున్నప్పటికీ,వాస్తవంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ ఆవేదన వ్యక్తం చేసరు.
బుధవారం ఉదయం నాలుగున్నర గంటలకు మెసేజ్లు పలువురు రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో వచ్చిన సందేశంలో రైతు భరోసా కింద రూ.11,850 తమ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. అయితే బ్యాంకు ఖాతాలను పరిశీలించగా నగదు జమ కాకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
ఒక ముఖ్యమంత్రి పేరుతో అధికారికంగా డబ్బులు జమ అయినట్లు సందేశాలు పంపినప్పుడు, ఆ మొత్తాలు రైతుల ఖాతాల్లో వాస్తవంగా జమ కావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేవలం సందేశాలు పంపి రైతులకు భరోసా కల్పించినట్లు ప్రచారం చేయడం సరైంది కాదు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ఖాతాల్లో నగదు ఎందుకు జమ కాలేదో స్పష్టమైన వివరణ ఇవ్వాలి.మెసేజ్‌లు అందుకున్న రైతులందరికీ వెంటనే రైతు భరోసా నిధులు జమ చేయాలి. సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
రైతులకు ప్రకటనలు కాదు.. ఆర్థిక భరోసా కావాలి. మెసేజ్‌లలో కనిపించే రైతు భరోసా బ్యాంకు ఖాతాల్లో కూడా కనిపించాలి.
ఈ విషయంపై ముఖ్యమంత్రి,వ్యవసాయ శాఖ మంత్రి,సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం.