రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రీ సర్వే
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూభారతి సర్వే.. రైతులు సహకరించాలి సిద్దిపేట కలెక్టర్ హైమావతి బెజ్జంకి, నవంబర్ 3 (ప్రజావాణి) గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకే ప్రభుత్వం భూముల రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో కొనసాగుతున్న భూభారతి భూముల రీ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల రీ సర్వే నిర్వహిస్తున్నట్లు...