రైతుల అప్రమత్తతతో కాపర్ వైర్ల దొంగలు అరెస్ట్
రైతుల అప్రమత్తతతో కాపర్ వైర్ల దొంగలు అరెస్ట్! చెల్లెపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద అర్ధరాత్రి చోరీ.. నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించిన రైతులు మూడు నెలల క్రితమే చిన్నమారు ఫేజ్-2లో చోరీ.. మళ్లీ ఘటనతో రైతుల్లో ఆందోళన చిన్నంబావి, నవంబర్ 2 ప్రజావాణి: చిన్నంబావి మండలం చెల్లెపాడు ఎత్తిపోతల పథకం వద్ద కాపర్ వైర్ల చోరీకిపాల్పడుతున్ననిందితులను రైతులుఅప్రమత్తతతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాత్రివేళ పంటలకు నీరు పారిస్తున్న సమయంలో అనుమానాస్పద శబ్దాలువినిపించడంతో రైతులు పరిశీలించగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.చెల్లెపాడు గ్రామానికి చెందిన రైతులు...