-రైతులకు అండగా
ధాన్యం ధర క్వింటాల్‌కు రూ.4,000లకు తగ్గకుండా రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాలని
-ఎంసిపిఐయు కేంద్ర కమిటీ సభ్యులు, ఆలిండియా కిసాన్ సభ నాయకులు వస్కుల మట్టయ్య
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 10
మిర్యాలగూడ నవంబర్ 10:- రైతులకు అండగా
ధాన్యం ధర క్వింటాల్‌కు రూ.4,000లకు తగ్గకుండా రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాలని ఎంసిపిఐయు కేంద్ర కమిటీ సభ్యులు, ఆలిండియా కిసాన్ సభ నాయకులు వస్కుల మట్టయ్య డిమాండ్ చేశారు. మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో రైస్ మిల్లర్లు ధాన్యం ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారున్నారు. రైతులు, మిల్లర్లకు నష్టం కలగకుండా ధాన్యం క్వింటాల్‌కు రూ.4,000 తగ్గకుండా కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్లను కోరారు. ఒక ప్రక్క ఎల్ నీనో కరువు, మరో ప్రక్క సాగు నీటి ఇబ్బందులతో అధిక పెట్టుబడి పెట్టి రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, రైతులు ఆర్థికంగా నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆయన వెంట ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి వస్కుల సైదమ్మ, సహాయ కార్యదర్శి పోతుగంటి కాశి,నాయకులు మోహన్ నాయక్, భరత్ తదితరులు న్నారు