prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 7:49 pm Digital Edition : PRAJA VANI

రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు ఆలేరు విద్యార్థులు.

రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు ఆలేరు విద్యార్థులు.

ప్రజావాణి,నెల్లికుదురు: మండలంలోని ఆలేరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు యశ్వంత్ రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు,గణేష్ తేజ్ రాష్ట్రస్థాయి సెపక్ తాక్రా పోటీలకు ఎంపికైనట్లు ఎంఈఓ,ఆ పాఠశాల హెచ్ఎం ఆంగోతు రాందాస్ తెలిపారు. మండల కేంద్రంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 13 నుండి నిజామాబాద్ లో జరిగే సాఫ్ట్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలలో యశ్వంత్ పాల్గొని ఆడనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 12 నుండి జనగామలో జరిగే ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి సెపక్ తాక్రా పోటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గణేష్ తేజ్ పాల్గొంటారన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులైన విద్యార్థులను,ఇందుకు దోహదపడిన ఫిజికల్ డైరెక్టర్ ను తమతో పాటు, పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్,ఉపాధ్యాయ బృందం గ్రామస్తులు అభినందించినట్లు ఎంఈఓ తెలిపారు.