prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 9:01 pm Digital Edition : PRAJA VANI

రాయికల్‌లో క్రికెట్ సందడి… మైదానంలో హోరెత్తిన యువత

*రాయికల్‌లో క్రికెట్ సందడి… మైదానంలో హోరెత్తిన యువత*

—జిల్లా స్థాయి టోర్నీ ప్రారంభం – RDPL MCC సీజన్-1

*రాయికల్, నవంబర్ 11(ప్రజావాణి)*

రాయికల్ పట్టణంలోని 3వ వార్డులో గల సీడెం భీం మైదానంలో RDPL MCC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ (సీజన్-1) బుధవారం ఘనంగా ప్రారంభమైంది.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ భోగ శ్రావణి ప్రవీణ్, రాయికల్ మాజీ సర్పంచ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మచ్చ నారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లెడ చిన్న ధర్మపురి కలిసి టాస్ వేసి టోర్నమెంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు.ఈ టోర్నమెంట్‌లో ప్రథమ విజేత జట్టుకు రూ. 50,000 నగదు బహుమతిని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ భోగ శ్రావణి ప్రవీణ్ చేతుల మీదుగా అందజేయనున్నారు. ద్వితీయ విజేత జట్టుకు రూ. 30,000 నగదు బహుమతిని రాయికల్ మాజీ సర్పంచ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ నారాయణ చేతుల మీదుగా అందజేయనున్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, క్రీడలు యువతలో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయడానికి ఇలాంటి జిల్లా స్థాయి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఇంతటి మంచి క్రీడా పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ జగిత్యాల జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో 14 మండలాల నుండి 14 జట్లను ఎంపిక చేశామని అన్నారు. 11 నవంబర్ బుధవారం రోజున ప్రారంభమైన ఈ టోర్నమెంట్ ఈ నెల 30వ తేదీ లోపు ముగుస్తుందని తెలిపారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ, గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునే మంచి వేదికగా RDPL MCC సీజన్-1 నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఆకుల మహేష్, పట్టణ అధ్యక్షులు కుర్మా మల్లారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అన్నవేణి వేణు, దిశ కమిటీ సభ్యులు భుక్యా నాయక్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న సంజీవ్, గుడికోట దేవాలయ చైర్మన్ మచ్చ శ్రీధర్, సామల్ల సతీష్, లింగ శ్రీను తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు, టోర్నమెంట్ నిర్వాహకులు పెండెం చంద్రశేఖర్, సుంకె వంశీ, కొల నరేష్, ఫైజల్ తదితరులు పాల్గొన్నారు.