prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 11:54 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

రాజారాంపల్లిలో విషాదం: విద్యుత్ షాక్‌తో పది నెలల చిన్నారి మృతి

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన విభూది ఆద్య (10 నెలలు) అనే చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయింది. చార్జింగ్ పెట్టి ఉన్న ‘విద్యుత్ కాంట’ ను చిన్నారి ముట్టుకోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కళ్లముందే పసికందు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేశాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.