రాఘవపూర్ శివారులో 1.161 కిలోల గంజాయి పట్టివేత
గంజాయి విలువ రూ.58,050.. నిందితుడిపై కేసు నమోదు
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 4:
పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవపూర్ గ్రామ శివారులో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. బుధవారం సాయంత్రం రాఘవపూర్ గ్రామ శివారులోని ఎల్‌ఎంఎన్ బిక్స్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ క్రమంలో అతని వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలకు గంజాయిని విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు వెల్లడైనట్లు తెలిపారు. నిందితుడిని హైదరాబాద్‌కు చెందిన పాకాల లోకేష్‌గా గుర్తించారు.
అతని వద్ద నుంచి మొత్తం 1 కిలో 161 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.58,050 ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, గంజాయి ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? దీని వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దపల్లి రూరల్ ఎస్సై తెలిపారు.