మోడల్ స్కూల్ టీచర్స్ నిరసన..తహసిల్దార్ కు వినతి
మోడల్ స్కూల్ టీచర్స్ నిరసన..తహసిల్దార్ కు వినతి ప్రజావాణి,నెల్లికుదురు:పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లికుదురు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సోమవారం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్ర మోడల్ స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు రెండో దశ నిరసనలో భాగంగా మండల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, ఇంటర్మీడియట్ వరకు బోధిస్తున్న పీజీటీలకు జూనియర్ లెక్చరర్ (జేఎల్) వేతన స్కేలు వర్తింపజేయాలని, జీవో...