prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 8:33 pm Digital Edition : PRAJA VANI

మేచరాజుపల్లిపెద్ద తండాలో విసిపిసి కమిటీలు ఏర్పాటు.

మేచరాజుపల్లిపెద్ద తండాలో విసిపిసి కమిటీలు ఏర్పాటు..
ప్రజావాణి,నెల్లికుదురు :మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి, పెద్దతండ గ్రామాలలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జలగం సునీత ఆధ్వర్యంలో శనివారం గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలు (విసిపిసి) ఏర్పాటు చేశారు. మేచరాజుపల్లి కమిటీకి కన్వీనర్ గా స్థానిక సర్పంచ్ తూర్పాటి శంకర్, పెద్దతండ కమిటీ కన్వీనర్ గా బాదావత్ సుధారాణి సురేష్ వ్యవహరిస్తారు. ఆయా గ్రామాలకు మరో 15 మంది చొప్పున కమిటీ సభ్యులను ఎంపిక చేశారు.సూపర్వైజర్ జలగం సునీత ఆయా గ్రామాలలో వేరువేరుగా మాట్లాడుతూ పిల్లలపై జరిగే నేరాలనియంత్రణ,బాల్యవివాహాలు, బాలల అక్రమ రవాణ,శారీరక మానసిక వేధింపుల నుంచి సంరక్షించడానికి పిల్లలకు,తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి విసిపిసి కమిటీ కృషి ఆ చేస్తుందని తెలిపారు.బాలికలకు,పిల్లలకు ఇతరుల నుంచి ఇబ్బందులు తలెత్తితే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు. కార్యక్రమాలలో అంగన్వాడీ టీచర్లు రాయపురం సరోజన,మోరపోజు లీలావతి,ఎండి మహబూబి,ఎల్తూరి సునీత,గర్భిణీ స్త్రీలు, బాలింతలు,కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.