మూడు గంటల్లోనే ఇద్దరు బాలుర ఆచూకీ.. ఘట్కేసర్ పోలీసుల మెరుపు వేగం!
ఘట్కేసర్, నవంబర్ 1 (ప్రజావాణి): మిస్సింగ్ ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన ఘట్కేసర్ పోలీసులు కేవలం మూడు గంటల్లోనే తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలుర ఆచూకీ గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు, సమన్వయంతో చేపట్టిన గాలింపు చర్యలు, వేగవంతమైన పోలీసు స్పందనతో బాలురను సురక్షితంగా గుర్తించడం విశేషం. కొండాపూర్ గ్రామానికి చెందిన ఓర్సు వసంత, ములుగురం లలితలు తమ కుమారులు ఓర్సు శివప్రసాద్ (12), ములుగురం యశ్వంత్ (13) కనిపించడం లేదని అక్టోబర్ 31వ తేదీ రాత్రి...