prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 6:34 pm Digital Edition : PRAJA VANI

ముస్కు రేవతి ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ముస్కు రేవతి ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 04 (ప్రజావాణి): జిల్లా లోని పాలకుర్తి మండలానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకులు, పాలకుర్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముస్కు రాంబాబు సతీమణి, ఈరవెన్ను గ్రామ మాజీ సర్పంచ్ ముస్కు రేవతి ని మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ముస్కు రేవతి ఇటీవల వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు పాముకాటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఇంటి వద్ద కోలుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే వారి నివాసానికి వెళ్లి రేవతి ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ ఉద్యమంలో ముస్కు రాంబాబు దంపతులు చేసిన సేవలు మరువలేనివని, ఉద్యమ సమయంలో వారి కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా మాజీ మంత్రి గుర్తుచేశారు. రేవతి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం కోసం ఎలాంటి సహాయం అవసరమైనా అందిస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గంలోని జిల్లా, మండల, గ్రామ స్థాయి ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.