ముదిగొండ నూతన తహసీల్దార్‌ను కలిసిన పొంగులేటి యువసేన నాయకులు
ముదిగొండ నవంబర్ 11 ప్రజావాణి
ముదిగొండ: ముదిగొండ మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్‌ను పొంగులేటి యువసేన నాయకులు సయ్యద్ రఫీ, గడ్డం అంజయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన తహసీల్దార్‌కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకమైన పాలన అందించాలని కోరారు.