prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 8:21 pm Digital Edition : PRAJA VANI

మహిళల సాధికారత కోసం కొట్లాడి నిధులు తెస్తా

*మహిళల సాధికారత కోసం కొట్లాడి నిధులు తెస్తా*

నారీ నైపుణ్య స్కిల్ సెంటర్ ప్రారంభోత్సవంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం మహిళల సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హామి ఇచ్చారు..పేదరికంలో ఉన్న, ఒంటరి మహిళలు స్వయంకృషి, ఆత్మగౌరవంతో జీవించేందుకు ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. మంగళవారం ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపాన ‘ది గాడ్ థైరిస్సా మహిళా మండలి’ ఆధ్వర్యంలో ‘కే.సీ.పుల్లయ్య ఫౌండేషన్’,’ కెపిసి ప్రాజెక్టు లిమిటేడ్ కంపెనీ’ సౌజన్యంతో
ఏర్పాటు చేసిన ‘నారీ నైపుణ్య శిక్షణా కేంద్రం'( ఉచిత మహిళా కుట్టు శిక్షణా తరగతుల కేంద్రం) ప్రారంభోత్సవానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి జీ వి మాల్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గుర్రం ఉమా మహేశ్వరరావుతో కలిసి శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, మహిళల పేదరికాన్ని పారదోలేందుకు, ఆర్థిక స్వావలంబనకు, ఆత్మ గౌరవంతో జీవించేందుకు కే.సీ. పుల్లయ్య ఫౌండేషన్, గాడ్ థెరిస్సా మహిళా మండలి, కెపిసి కన్స్ట్రక్షన్స్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. హైదరాబాద్, విజయవాడలలోని భారతరత్న డాక్టర్ బీ. ఆర్. అంబేడ్కర్ విగ్రహాలను నెలకొల్పడంలో కె సి పుల్లయ్య ఫౌండేషన్ ప్రధాన భూమిక పోషించిందన్నారు. రాజకీయాలకు అతీతంగా మానవీయ దృక్పథంతో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు మరిన్ని ముందుకు సాగాలని ఎంపీ రవిచంద్ర అభిలషించారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు పుట్టినరోజు సందర్భంగా జూలై 24వతేదీన “స్మైల్ ఏ గిఫ్ట్”పేరుతో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ లో 2వేల మంది మహిళలకు కుట్టుమిషన్లు బహుకరించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తన గాయత్రి గ్రానైట్స్ కంపెనీ నుంచి, జీ మాల్ ఉమా మహేశ్వర రావు సహాయంతో మరికొందరు మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన హామి ఇచ్చారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కేంద్రం విస్తృతికి కృషి చేస్తానని రవిచంద్ర చెప్పారు. కొద్ది పెట్టుబడితో చిన్నగా మొదలుపెట్టి కోట్ల రూపాయల టర్నోవర్ కు చేరుకున్న వ్యాపారులను సూరత్, బెంగళూరు తదితర చోట్ల తాను చూశానన్నారు.క్రమశిక్షణతో కష్టపడి పని చేయడం, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా జీవితంలో ఉన్నతంగా ఎదగొచ్చని, అటువంటి వారికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎంపీ రవిచంద్ర వివరించారు.

జి వి మాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎం డి గుర్రం ఉమామహేశ్వర్ రావు మాట్లాడ్తూ ఎవ్వరిమీద ఆధారపడకుండా స్వతహాగా స్వత్రంతంగా జీవించేందుకు ఈనాటి మహిళలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కెసి పుల్లయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్చంధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెబుతూ ఈ సందర్భంగా ఫౌండేషన్ ను అభినందించారు. నారీ నైపుణ్య శిక్షణ కేంద్రంకు తనవంతుగా అన్ని విధాలుగా సహకరిస్తానని, వస్త్ర రంగంలో ఉన్న తాను అవసరం అయితే ఒక రోజు తాను కూడా మహిళలకు ప్రస్తుత ప్యాషన్, వస్తరంగం, డిజైన్లు తదితర అంశాలపై శిక్షణ ఇస్తానని హామి ఇచ్చారు ఈ కార్యక్రమంలో కె సి ఫౌండేషన్ సి ఇ వోచల్లా సుధారాణి, కెసి ఫౌండేషన్ హెల్త్ విభాగం ప్రాజెక్టు డైరెక్టర్ స్వప్న, ఖమ్మం ప్రాజెక్టు మేనేజర్ సుందర్, ది గాడ్ థేరిస్సా మహిళా మండలి అధ్యక్షురాలు ఆవుల నాగరాణి,ప్రధాన కార్యదర్శి ఉమా, కోశాధికారి ఖతీజా బేగం, సంయుక్త కార్యదర్శి సురబీ అనిత, రాజ్యంగ పరిరక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు, పాపులర్ ఛానల్ ఎం డి సాధిక్ అలీ, సీనియర్ జర్నలిస్ట్ వనం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిధులను ఘనంగా సత్కరించారు.