మహా పాదయాత్రకు భైంసా నుంచి భారీ మద్దతు
*మహా పాదయాత్రకు భైంసా నుంచి భారీ మద్దతు!* *ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆధ్వర్యంలో నిర్మల్‌కు బీజేపీ నాయకులు, కార్యకర్తల పయనం* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, భైంసా. నవంబర్ 3:– నిర్మల్‌లో మంగళవారం బీజేపీ నిర్వహించ తలపెట్టిన మహా పాదయాత్రకు ముధోల్ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివెళ్లాయి. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నేతృత్వంలో భైంసా పట్టణం నుంచి నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు సమూహాలుగా బయలుదేరారు. బైకులు, కార్లతో చేపట్టిన ర్యాలీ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది....