prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 6:39 pm Digital Edition : PRAJA VANI

మల్లేశం మృతి బీఆర్‌ఎస్ నాయకుల సంతాపం

మల్లేశం మృతి బీఆర్‌ఎస్ నాయకుల సంతాపం

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 03

ఓదెల మండలం గుంపుల గ్రామ మాజీ సర్పంచ్ సంపత్ తండ్రి మల్లేశం అనారోగ్యంతో మృతి చెందడం పట్ల పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి మనోహర్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

మల్లేశం మృతి చెందిన విషయం తెలుసుకున్న దాసరి మనోహర్ రెడ్డి గారు గుంపుల గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి మల్లేశం పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

అనంతరం మల్లేశం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి ధైర్యం చెబుతూ, ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మల్లేశం మృతికి సంతాపం తెలిపారు.