కరీంనగర్, నవంబర్ 1 (ప్రజావాణి)
కరీంనగర్ మాలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ఆధ్వర్యంలో, సంస్థ ఎండి ఎంపీ అహ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ అంబేద్కర్ గ్రౌండ్ ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఉద్యోగులు ఒకరోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని గ్రౌండ్ పరిసరాల్లో పెరిగిన గడ్డిని తొలగించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి కవర్లలో వేసి పరిసరాలను శుభ్రం చేశారు.స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రమైన పరిసరాల కోసం అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాలబార్ అసిస్టెంట్ డైరెక్టర్ వివేక్, సేల్స్ అసిస్టెంట్ మేనేజర్ సిద్ధాంత్, చిలుముల శ్రీనివాస్‌తో పాటు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.