*మండల స్థాయి సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థుల క్రీడా పోటీలు*
గూడూరు మండల ప్రతినిధి:- నవంబర్ 02. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలంలోని ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల సిడబ్ల్యూఎస్ఎన్ కోసం, మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి ఆడెపు సుజాత చేతులమీదుగా బహుమతుల ప్రధాన చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ మమత, మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఏఎమ్ఓ. వెంకటేశ్వర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిఆర్పి శోభన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.