మండల కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల పెత్తనమా..? అధికారుల విధులకు రాజకీయ జోక్యమే అడ్డంకా

మండల కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల పెత్తనమా..? అధికారుల విధులకు రాజకీయ జోక్యమే అడ్డంకా..! తహసీల్దార్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఇదే పరిస్థితి.. సామాన్యుడికి న్యాయం ఎక్కడ? మండల స్థాయిలో పరిపాలన వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్ల మధ్య పనిచేస్తోందన్న విమర్శలు.. అధికారుల స్వతంత్రతపై ప్రశ్నలు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గ్రామీణ స్థాయిలో పరిపాలనా వ్యవస్థ తీరులో పెద్దగా మార్పు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు సేవలందించాల్సిన మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు కొన్నిచోట్ల రాజకీయ జోక్యానికి వేదికలుగా మారుతున్నాయనే ఆరోపణలు...