prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 12:27 pm Digital Edition : PRAJA VANI

మంచితనమే మార్గం.. ఆప్యాయతే ఆభరణం.. జుక్కల్ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు నాగరాజు ఘనంగా జన్మదిన వేడుకలు

మంచితనమే మార్గం.. ఆప్యాయతే ఆభరణం.. జుక్కల్ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు నాగరాజు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

విద్యార్థులతో ఎంతో కలిసి ఉండి విద్య బోధన చెపుతూ విద్యార్థుల క్రమశిక్షణతో మంచి మార్గంలో నడవాలని కళాశాల ఉపాధ్యాయులు నాగరాజు అన్నారు..

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 03

ఎల్లప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తూ, తన అనుభవంతో అందరికీ మార్గదర్శకంగా నిలుస్తూ, ఆప్యాయతతో అందరినీ సన్మార్గంలో నడిపించే జుక్కల్ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు నాగరాజు గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
నలుగురితో కలిసిమెలిసి ఉంటూ, ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ, విద్యార్థులకు విద్యాబోధన తోపాటు క్రమశిక్షణ ఆటపాటలు ఎంతో చక్కగా మంచి మార్గం నడిచే విధంగా చెప్పి మనసున్న మహారాజు తన మంచితనంతో అందరి మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాగరాజు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, జూనియర్ కళాశాల ఉపాధ్యాయుల బృందం అలాగే విద్యార్థులు శ్రేయోభిలాషులు, అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రమేష్ సార్ మాట్లాడుతూ.. నాగరాజు గారు అందించే ప్రోత్సాహం, చూపించే ఆప్యాయత, అందించే మార్గదర్శనం వెలకట్టలేనివని కొనియాడారు. ఆయన సలహాలు, సూచనలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయని, ఆయన ఆశీస్సులు తమకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
భగవంతుడి ఆశీస్సులతో నాగరాజు గారు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, మరెన్నో జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.