భైంసా మున్సిపాలిటీలో అవినీతి మరకలు.. మారని అధికారుల తీరు

*భైంసా మున్సిపాలిటీలో అవినీతి మరకలు.. మారని అధికారుల తీరు!* *గతంలో కమిషనర్ ప్రభాకర్.. ఇప్పుడు ఇన్‌చార్జి కమిషనర్ సంతోష్ జాదవ్! రూ.50 వేల లంచం కేసుతో మరోసారి వెలుగులోకి మున్సిపల్ కార్యాలయ అవినీతి బాగోతం.. ఏసీబీ దాడులు జరుగుతున్నా అధికారుల్లో మార్పు లేదా?* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో భైంసా నవంబర్ 9:– ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారుతున్నాయా? లంచం ఇవ్వనిదే ఫైలు కదలదా? ప్రభుత్వ పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయాలన్నా ముడుపులు చెల్లించాల్సిందేనా?...