prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 1:40 pm Digital Edition : PRAJA VANI

భూభారతి రీ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్

భూభారతి రీ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్

రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రీ సర్వే దోహదం

సిద్దిపేట కలెక్టర్ హైమావతి

బెజ్జంకి,నవంబర్ 3(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో మంగళవారం కొనసాగుతున్న భూభారతి భూముల రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహణ తీరును, క్షేత్రస్థాయిలో చేపడుతున్న పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో భూముల రీ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఇతర అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకొని సర్వే సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని కోరారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని తహసీల్దార్, సర్వే సిబ్బందికి సూచించారు. భూములకు సంబంధించిన సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి రీ సర్వే ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్,జిపివో రజిత, సంబంధిత అధికారులు,సర్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.