బెజ్జంకి మోడల్ స్కూల్‌ను ప్రక్షాళన చేయాలి
వరుస ఘటనలపై బగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు
ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఎస్ఎఫ్ఐ సీనియర్ నాయకులు బొమ్మిడి సాయి కృష్ణ
బెజ్జంకి, నవంబర్ 7 (ప్రజావాణి)
సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని మోడల్ స్కూల్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలపై విద్యార్థి సంఘాలుబగ్గుమంటున్నాయి. ఇటీవల పాఠశాలలో విద్యార్థినీలు గన్నేరు పువ్వులు తిన్న ఘటన అత్యంత బాధాకరమని ఎస్ఎఫ్ఐ సీనియర్ నాయకుడు బొమ్మిడి సాయి కృష్ణ అన్నారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్రంగా,ఉన్నతస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.మోడల్ స్కూల్‌లో జరుగుతున్న వరుస ఘటనలకు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.పాఠశాల సిబ్బంది మధ్య నెలకొన్న విభేదాలు, పరస్పర కక్ష సాధింపు చర్యలు విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విమర్శించారు.పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై పూర్తిస్థాయి విచారణ జరిపి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ తగిన చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ బెజ్జంకి మండల కమిటీ డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.