prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 1:02 pm Digital Edition : PRAJA VANI

బుర్హనపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – 20 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక

బుర్హనపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – 20 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక

పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 04 (ప్రజావాణి): జిల్లా లోని పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గనికి చెందిన రాయపర్తి మండలం బుర్హనపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 20 కుటుంబాలు గ్రామ సర్పంచ్ సూదులు ఉమాదేవి ఆధ్వర్యంలో ఆ పార్టీకి రాజీనామా చేసి గురువారం పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి సమక్షంలో ఆమె చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై రోజురోజుకూ ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. బుర్హనపల్లి గ్రామ అభివృద్ధికి సర్పంచ్ ఉమాదేవి తో కలిసి అందరం కలిసి పని చేద్దామని, పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని, గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.

నూతనంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.