బీజేపీ జాతీయ అధ్యక్షుడు మన్నాలాల్ రావత్‌ను కలిసిన లావుడ్య రాములు నాయక్
ప్రజావాణి ప్రతినిధి:
మెదక్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు లావుడ్య రాములు నాయక్ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ మన్నాలాల్ రావత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ భేటీలో పార్టీ బలోపేతం, గిరిజన ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల విస్తరణ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. గిరిజనుల అభ్యున్నతికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ప్రాధాన్యతను వివరించారు.
మెదక్ జిల్లాలో బీజేపీ ఎస్టీ మోర్చాను మరింత బలోపేతం చేస్తూ, గిరిజన ప్రజలకు పార్టీ అందిస్తున్న సేవలు, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని లావుడ్య రాములు నాయక్ తెలిపారు.
ఈ మర్యాదపూర్వక భేటీ పార్టీ నాయకుల మధ్య పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు దోహదపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.