prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 8:14 pm Digital Edition : PRAJA VANI

బండ లేమూర్ గ్రామానికి అదనంగా బస్సు రాకపోకలు కొనసాగించాలి

*బండ లేమూర్ గ్రామానికి అదనంగా బస్సు రాకపోకలు కొనసాగించాలి*

– *ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేసిన బండాలేముర్ గ్రామసర్పంచ్ పాతులోత్ శ్రీనివాస్ నాయక్ గ్రామస్తులు*

రంగారెడ్డి జిల్లా నవంబర్ 11 (ప్రజావాణి ):మంచాల ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం
బండలేమూర్ గ్రామానికి ప్రజల విద్యార్థుల అవసరం సౌకర్యార్థం అదనంగా బస్సు రాకపోకలు కొనసాగించాలని కోరుతూ బండలేమూర్ గ్రామసర్పంచ్ పాతులోతు శ్రీనివాస్ మాజీ సర్పంచ్ పోచమోని కృష్ణ ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామం ప్రజలకు విద్యార్థులకు అనువైన సమయంలో బస్సులు లేవని అన్నారు పాఠశాల కళాశాలల సమయానికి బస్సు ట్రిప్పులేక విద్యార్థులు అనేక అవస్థలకు గురవుతున్నారని అన్నారు గ్రామంలో ప్రజలు తమ అవసరాల నిమిత్తం ఇతర గ్రామాలకు వెళ్లడానికి ఉదయం 9:30 దాటితే మధ్యాహ్నం 2 గంటల వరకు బస్సులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, విద్యార్థులకు పాఠశాలలకు పోవడానికి ఉదయం బస్సు ఉన్నప్పటికీ మళ్లీ సాయంత్రం విద్యార్థులు ఇండ్లకు రావడానికి బస్సు ట్రిప్పులేక నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు కావున బండలేమూర్ గ్రామ ప్రజల విద్యార్థుల సౌకర్యార్థం బండలేమూర్ నుండి 11,నుండి 12 గంట ల మధ్యన ఒక బస్సు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఒక ట్రిప్పును బండలేమూర్ వరకు వేయాలని చెప్పారు అలాగే బండ లేమూర్ కు ఇబ్రహీంపట్నం నుండి రాత్రి 8:00 దాటితే బస్సు లేకపోవడంతోటి గ్రామస్తులు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని చెప్పారు.8 గంటల తర్వాత కొంతమంది గ్రామస్థులు పనుల నిమిత్తం ఇబ్రహీంపట్నం ఇతర ప్రాంతాలకుపోయి వచ్చేవారు ఇబ్బందులపాలవుతున్నారని అన్నారు కావున
ఇబ్రహీంపట్నం నుండి రాత్రి 8:00 గంటల వెళ్ళే బస్సును ఎనిమిదిన్నరకు వేయాలని డిపో మేనేజర్ ను కోరడం జరిగిందని అన్నారు మేనేజర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ నెంబర్ జాపాల సుదర్శన్ ఎర్ర సత్తయ్య జట్రోత్ శ్రీను కెల్లోత్ కిషన్ మనోహర్ వర్త్య బన్నీ తదితరులు పాల్గొన్నారు.