ఫిర్యాదుతో కదిలిన మున్సిపల్ అధికారులు
*ఫిర్యాదుతో కదిలిన మున్సిపల్ అధికారులు* *మదీనా సూపర్ మార్కెట్లో తనిఖీలు.. చెడిపోయిన ఆహార పదార్థాలు సీజ్.. యజమానికి హెచ్చరికలు.. మయూరి ఏజెన్సీ గోదాంపైనా తనిఖీలకు సిద్ధం* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, భైంసా, నవంబర్ 10:– భైంసా పట్టణంలోని మదీనా కాలనీలో క్రెసెంట్ స్కూల్ సమీపంలో ఉన్న మదీనా సూపర్ మార్కెట్లో నాణ్యతలేని, చెడిపోయిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారంటూ స్థానికుల నుంచి మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు అందడంతో అధికారులు స్పందించారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఆహార పదార్థాల విక్రయాలపై వచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి...