prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 2:10 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

ప్రభుత్వ నిబంధనలకు అధికారులు త్రిలోదకాలు దీపావళి బాణాసంచా అనుమతులు

 

తొర్రూరు పట్టణంలోని పెద్ద చెరువు ప్రాంగణంలో గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాట్లు

పట్టించుకోని రెవెన్యూ అధికారులు

పర్యావరణానికి, తూట్లు పొడుస్తున్న దీపావళి బాణాసంచా, దుకాణదారులు

మామూళ్ల మత్తులో ప్రభుత్వ అధికారులు

 

తొర్రూర్
నవంబర్2 (ప్రజావాణి)

తొర్రూర్ పట్టణ కేంద్రంలో గత కొంతకాలంగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, దీపావళి బాణాసంచా దందా కొనసాగుతుంది. ఈ దుకాణాలకు అనుమతులు కాగితాలకే పరిమితమై, ప్రభుత్వం నిబంధనలు మాత్రం తుంగలో తొక్కుతూ, గత కొంతకాలంగా ధనార్జనే ధ్యేయంగా ఓ వ్యక్తి, పర్మిషన్ల పేరుతో ఒక దుకాణానికి సుమారు 70 వేల రూపాయలు చొప్పున వసూలు చేస్తూ, అధికారులకు మామూలు ఇస్తూ ప్రభుత్వ నిబంధనలకు త్రిలోదకాలు ఇస్తూ అక్రమ సంపాదన సొమ్ము చేసుకుంటున్నాడని వినికిడి. అదేవిధంగా ఈనెల 9 దీపావళి కావడంతో, సుమారు 10 షాపులకు, ఒక్కొక్క షాపుకు 70 వేల చొప్పున వసూలు చేసి సంబంధిత అధికారులకు మామూలు ఇచ్చి అనుమతులు తెచ్చాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతడి యొక్క తీరు చూస్తుంటే అధికారులే నాకు అండగా ఉండగా ఎవరికి ఏమైతే నాకేంటి అన్న తీరుగా ఉండడం విశేషం. షాపుల వద్ద ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ పొల్యూషన్ కంట్రోల్ అవసరమై నిబంధనలు పక్కన పెడుతూ తన ఇష్టానుసారంగా బాణాసంచా క్రయవిక్రయాలు చేయడం తొర్రూర్ లో ఆనవాయితీగా మారింది. ఎవరైనా మీడియా ప్రతినిధులు ఈ అంశంపై నిలదీస్తే నీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి అంటూ భూకాయింపులు గతంలో కూడా చేసినట్టు ఈ దుకాణాలకు అనుమతులు తెచ్చే ఈ వ్యక్తిపై ఆరోపణలు లేకపోలేదు.

*ఫైర్ అనుమతులపై డిఎఫ్ఓ వివరణ*

ప్రజావాణి జిల్లా ప్రతినిధి డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ ను చరవాణి ద్వారా వివరణ కోరగా,
తొర్రూరు లో బాణాసంచా షాపులో అనుమతులకు జిల్లా ఫైర్ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేవని డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు.
కావున జిల్లా కలెక్టర్ ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి అక్రమ ధనార్జనే లక్ష్యంగా పనిచేస్తున్న ఆ వ్యక్తి యొక్క, తీరుపై సమగ్ర విచారణ చేపట్టి, ఒక్క షాపుకు 70,000 వేల చొప్పున వసూలు చేస్తున్న ఈ వ్యక్తిపై చర్యలు చేపట్టి ప్రభుత్వానిబంధనలకు విరుద్ధంగా అనుమతులు తీసుకువచ్చి ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా నిబంధనలు కాగితాలకే పరిమితం చేస్తున్న ఈ వ్యక్తిపై, ప్రభుత్వ నిబంధనలు పాటించని బాణాసంచా షాపుల లైసెన్సులు రద్దు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.