prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 9:09 am Digital Edition : MAHESH MEDCHAL

ప్రభుత్వ ఉస్మానియా డెంటల్ కాలేజీలో బీడీఎస్ సీటు సాధించిన వెలూరి ఉమికను అభినందించిన ఎంపీ ఈటల రాజేందర్

ప్రభుత్వ ఉస్మానియా డెంటల్ కాలేజీలో బీడీఎస్ సీటు సాధించిన వెలూరి ఉమికను అభినందించిన ఎంపీ ఈటల రాజేందర్ మరియు నాయకులు
​
మేడ్చల్ ​బీజేపీ సీనియర్ నాయకురాలు శ్రీమతి ప్రతిభా సంతోష్ గారి కుమార్తె వెలూరి ఉమిక తన ప్రతిభతో ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఉస్మానియా గవర్నమెంట్ డెంటల్ కాలేజ్, హైదరాబాద్‌లో బీడీఎస్ సీటు సాధించడం ఎంతో అభినందనీయమని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెలూరి ఉమిక తన తల్లిదండ్రులతో కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు ఈటల రాజేందర్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి మంచి వైద్యురాలిగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. అలాగే మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఉమికను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ డివిజన్ అధ్యక్షురాలు శ్రీమతి శైలజ, జిల్లా కోశాధికారి ఎల్.వి.శ్రీకాంత్, డివిజన్ ఉపాధ్యక్షులు మైసరి రాజు గారు తదితరులు పాల్గొని వెలూరి ఉమికకు అభినందనలు తెలియజేస్తూ.. భవిష్యత్తులో తల్లిదండ్రులకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.