ప్రత్యక్ష పరిశీలనతో వృక్షశాస్త్రంపై విద్యార్థులకు అవగాహన

ప్రత్యక్ష పరిశీలనతో వృక్షశాస్త్రంపై విద్యార్థులకు అవగాహన కూసుమంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోటనీ ఫీల్డ్ ట్రిప్ కూసుమంచి (మన ప్రజావాణి) ప్రతినిధి RK : విద్యార్థుల్లో పుస్తక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా కూసుమంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం బైపీసీ విద్యార్థులకు బోటనీ ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ వీరభద్రరావు అధ్యక్షతన, వృక్షశాస్త్ర అధ్యాపకురాలు కళ్యాణి ఆధ్వర్యంలో ఈ క్షేత్ర పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల సమీపంలోని చెరువులు, వ్యవసాయ పొలాలు, సహజ పరిసర...