prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 3:28 pm Digital Edition : PRAJA VANI

ప్రజాస్వామ్యా విముక్తికి విరుద్ధంగా వివరిస్తున్న కూటమి

ప్రజాస్వామ్యా విముక్తికి విరుద్ధంగా వివరిస్తున్న కూటమి

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో
(నవంబర్ 5) దర్శి

దర్శి నియోజకవర్గంలో ఎన్నికల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
దర్శి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే ఘటనలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.
ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు దాడులకు, అక్రమాలకు, రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి.
ఎన్నికలు అంటే ప్రజలు తమకు నచ్చిన ప్రతినిధులను స్వేచ్ఛగా, నిర్భయంగా ఎన్నుకునే పవిత్రమైన ప్రజాస్వామ్య ప్రక్రియ. అలాంటి ఎన్నికల్లో దాడులు, బెదిరింపులు, అక్రమాలకు పాల్పడుతూ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
మా ప్రధాన డిమాండ్లు:
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ఎన్నికల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి.
దాడులకు పాల్పడిన వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
రిగ్గింగ్ ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి.
ఓటర్లకు, అభ్యర్థులకు పూర్తి రక్షణ కల్పించాలి.
ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలి.
ప్రజాస్వామ్యంలో అధికారం బలప్రయోగంతో కాదు… ప్రజల స్వేచ్ఛాయుత తీర్పుతో రావాలి!
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. 2029 ఎలక్షన్లో రాష్ట్ర ప్రజలే బుద్ధి చెబుతారని సమావేశంలో తెలియజేశారు. వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఏన్ని కేసులు పెట్టుకున్న, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా పార్టీ కోసం ప్రతి ఒక్కరూ నిలబడ్డందుకు ధన్యవాదాములు తెలియజేశారు. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు జిల్లా అధ్యక్షులు మరియు దర్శి శాసనసభ సభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక్కరికి వైఎస్ఆర్సిపి పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు.
MRPS దండోరా రాష్ట్ర అధ్యక్షులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి
9441917159
6300697417