ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో
ప్రజావాణి,నెల్లికుదురు: ప్రజా సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజావాణి ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సింగారపు కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం యధావిధిగా జరుగుతుందని ఎంపీడీవో పేర్కొన్నారు.వివిధ శాఖల అధికారులు ప్రజావాణి వేదికకు హాజరుకానున్న దృష్ట్యా ఆయా గ్రామాల కు చెందిన ప్రజలు తమ సమస్యల తో కూడిన ఫిర్యాదులను అధికారులకు అందజేసి పరిష్కరింప చేసుకోవడానికి ప్రజావాణి చక్కని వేదికని తెలిపారు.