ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నిండాలి
*ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నిండాలి* *ముధోల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ దీపావళి శుభాకాంక్షలు* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 8:– దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాల మధ్య జరుపుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఆయన హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఇంటా ఆనందం, ప్రతి కుటుంబంలో...